శనివారం ఉదయం చెన్నూరు మండలం ఉప్పరపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొండపేట నుంచి వస్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆళ్లగడ్డకు చెందినదని గుర్తించారు.