ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా, సోమవారం కమలాపురం పాలిటెక్నిక్ కళాశాల మరియు మదర్ థెరిసా సేవా సమితి సంయుక్తంగా భారీ ర్యాలీని నిర్వహించాయి. కళాశాల ప్రిన్సిపాల్ డి. సత్యనారాయణ రెడ్డి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సి. మధు, ఈసీఈ హెచ్‌ఓడీ ఎస్. లలిత, మరియు విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశ్యం.