చెన్నూరులో మహిళా భద్రత, సైబర్ నేరాలపై అవగాహన

చెన్నూరు అరుంధతి నగర్‌లో శుక్రవారం ఏఎస్ఐ శంకర్ నాయక్ మహిళలకు భద్రతపై అవగాహన కల్పించారు. భారత న్యాయ సంహిత చట్టాలు, మహిళల హక్కులను వివరించారు. సైబర్ మోసాలు, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని సూచించారు. ఆపద సమయంలో 112, 1091, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని కోరారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ సునంద, హోంగార్డు రాధిక పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్