వల్లూరు మండలం ఏ ఓబయపల్లి దగ్గర సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ రోడ్డు ప్రమాదానికి గురైంది. డ్రైవర్ మద్యం సేవించి నడపడం వలన సంఘటన చోటు చేసుకుంది. ఎవరికీ ఎటువంటి అపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి వల్లూరు ఎస్సై పెద్ద ఓబన్న తన సిబ్బందితో రోడ్డుపైన ఎటువంటి ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.