రాబోయే సెన్సస్-2027 ప్రక్రియను విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఆదివారం చెన్నూరులో 5కే రన్ ఉత్సాహంగా జరిగింది. స్థానిక ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, దేశాభివృద్ధికి, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు జనాభా గణన కీలకమని ఆయన తెలిపారు. సెన్సస్ సమయంలో ప్రతి ఒక్కరూ కచ్చితమైన సమాచారం అందించి అధికారులకు సహకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.