చెన్నూరు మండల కేంద్రంలోని అరుంధతి నగర్ లో ఉన్న కేసీ కెనాల్ లో శనివారం పూడికతీత పనులు ప్రారంభించారు. మండలం పరిధిలోని శివాలపల్లి నుండి ఓబులంపల్లి వరకు ఉన్న కాలువ ద్వారా రైతులకు సాగునీరు అందుతున్నది. ప్రస్తుతం కాలవలో నీరు లేకపోవడంతో అధికారులు పూడికతీత పనులను ప్రారంభించారు.