పాఠశాలలకు వెళ్లి చదువుకోవలసిన చిన్నారులకు ఆధార్ కార్డు లేకపోవడంతో ఇంటి దగ్గరే ఉండవలసిన పరిస్థితి నెలకొన్నది. చెన్నూరు మండల కేంద్రంలోని ఇటుకల బట్టి వద్ద ఉన్న చిన్నారులకు 8 సంవత్సరాలు వయసు ఉన్నా కూడా ఆధార్ కార్డులు లేవు. ఆధార్ కార్డు కోసం సచివాలయాలు తిరిగినా కూడా బర్త్ సర్టిఫికెట్ లేవని వెనక్కు పంపుతున్నారని చిన్నారుల తల్లులు వాపోతున్నారు. ప్రభుత్వ అధికారులు తమకు ఆధార్ కార్డు వచ్చేలా చూడాలని కోరుతున్నారు.