కొండపేట దేవస్థానం నవగ్రహాల ధ్వంసం: బీజేపీ నేతల ఆందోళన

కడప జిల్లా చెన్నూరు మండలం కొండపేట గ్రామంలో వందల ఏళ్ల నాటి దేవస్థానం వద్ద నవగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కడప జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డి, మండల అధ్యక్షులు వెంకట్రాం రెడ్డి, నాయకులు గోవింద్ గణేష్, ఇట్టెం శివరాం, శ్రీనివాస రాజు, వెంకటసుబ్బయ్య, కార్యకర్తలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సమస్యను సీఐ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. దేవస్థానం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు కూడా సీఐ చొరవ తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్