ఆశ్రమ విద్యార్థులకు పరుపులు, దిండ్లు వితరణ

కమలాపురం పట్టణంలోని అప్పాయపల్లెలో ఉన్న శ్రీ దయానంద స్వామి ఆశ్రమంలోని పేద విద్యార్థులకు శనివారం ప్రొద్దుటూరుకు చెందిన సూరత్ వాస్తవ్యులు శివపురం వెంకటేశ్వర్లు కుటుంబం రూ. 50 వేల విలువైన 60 పరుపులు, దిండ్లు, బెడ్ షీట్లను ఉచితంగా అందజేశారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గజ్జల వెంకటేశ్వర రెడ్డి, మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాతలు ఆశ్రమ నిర్వాహకులు అల్లే రాజారెడ్డి సేవలను కొనియాడారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్