ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలి

వైవీయూ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం పెండ్లిమర్రి మిట్టమీదపల్లెలో నీటి సంరక్షణపై అవగాహన కార్యక్రమం జరిగింది. డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, రేపటి తరానికి మనమిచ్చే సంపద నీరేనని, దానిని వృథా చేయరాదని, ప్రతి ఇంటా ఇంకుడు గుంతలు తవ్వాలని సూచించారు. వలంటీర్లు జల్ శక్తి అభియాన్, మిషన్ భగీరథ వంటి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించి, పోస్టర్లు, నినాదాలతో అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్