వల్లూరు మండలం పెద్ద లేబాకలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పయ్య దూడల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా 48 దూడలకు నట్టల మందు, మినరల్ బ్లాక్స్ ఉచితంగా అందజేశారు. అధికారులు డా. ఉత్తయ్య, డా. మాధవరెడ్డి మాట్లాడుతూ లాభసాటి పాడి పరిశ్రమకు 'ఏడాదికి ఒక దూడ' విధానం కీలకమని తెలిపారు. రూ. 1350 విలువైన లింగ నిర్ధారిత వీర్యం ప్రభుత్వం సబ్సిడీతో కేవలం రూ. 150కే అందిస్తోందని, రైతులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.