వైవీయూ డిగ్రీ పరీక్షల్లో విస్తృత తనిఖీలు: 8 మంది డిబార్

యోగి వేమన వర్సిటీ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో శనివారం 8 మంది విద్యార్థులను మాల్‌ప్రాక్టీస్ కింద గుర్తించి డిబార్ చేశారు. మైదుకూరులో ఇద్దరు, పుల్లారెడ్డిపేటలో ఆరుగురిని అధికారులు బహిష్కరించారు. హైపవర్ కమిటీ సభ్యులు పలు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం జరిగిన పరీక్షలకు మొత్తం 7,322 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్