జిల్లా వైద్యాధికారి డా. నాగరాజు ఆదేశాల మేరకు చెన్నూరు పీహెచ్‌సీ పరిధిలోని ఆర్. ఎం. పి కేంద్రాలను డా. వినయ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీలు కేవలం ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని, రోగులకు యాంటీబయాటిక్స్, సెలైన్లు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. మెరుగైన వైద్య సేవలకు రోగులను పెద్ద ఆసుపత్రులకు పంపాలని సూచించారు. నిబంధనలు మీరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బరామయ్య, నరసయ్య, మునిరెడ్డి పాల్గొన్నారు.