కడప: ఆస్తిపన్ను వసూళ్లపై అఖిలపక్షం వినతి

కడప నగరంలో చిన్న బకాయిదారులను వేధించకుండా, లక్షల మొండి బకాయిలను కఠినంగా వసూలు చేయాలని అఖిలపక్ష నేతలు మంగళవారం మున్సిపల్ కమిషనర్‌ను కోరారు. తక్కువ కాలంలో రూ. 60 కోట్లు వసూలు చేసినందుకు కమిషనర్‌ను అభినందించారు. ఆ నిధులతో మౌలిక వసతులు కల్పించాలని, ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ. 95 కోట్లు తెప్పించాలని, టిడ్కో ఇళ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, వక్ఫ్ భూములను కాపాడాలని వినతిపత్రం ద్వారా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్