కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా స్టెప్ సీఈఓ సాయిగ్రేస్, ప్రిన్సిపాల్ డి. సత్యనారాయణ రెడ్డి, మదర్ థెరిసా సేవా సమితి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జూటూరు విజయ్ కుమార్ పాల్గొన్నారు. స్టెప్ సీఈవో సాయిగ్రేస్ మాట్లాడుతూ రక్తదానంతో మరొకరికి పునర్జన్మ ప్రసాదించడం జరుగుతుందన్నారు.