కమలాపురం: రోడ్డు ప్రమాదంలో బాలుడికి గాయాలు

కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని క్రాస్ రోడ్ వద్ద శుక్రవారం ఒక ప్రమాదం జరిగింది. మండలంలోని కే. అప్పాయపల్లె గ్రామానికి చెందిన అలెక్స్ అనే బాలుడు రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలుడు గాయపడగా, స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్