వైసిపి జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో హామీలను విస్మరించి రూ. 3.12 లక్షల కోట్ల అప్పు చేసిందని ధ్వజమెత్తారు. అభివృద్ధి శూన్యమని, ఇసుక, మట్టి దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. అక్రమ కేసులతో తమ నాయకులను వేధిస్తున్నారని, లడ్డూపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. కడప జగన్ అడ్డా అని, స్థానిక ఎన్నికల్లో వైసిపి విజయం తథ్యమని ఆయన స్పష్టం చేశారు.