కమలాపురం నియోజకవర్గంలోని సమస్యల పరిష్కార ధ్యేయంగా సీపీఐ ఆధ్వర్యంలో ఉద్యమాలను చేపడుతున్నామని జిల్లా కార్యవర్గ సభ్యులు పి. చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం కమలాపురంలోని స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ఆవరణలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అలాగే నియోజకవర్గంలో అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు.