వీరాపునాయునిపల్లిలో పెన్షన్ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వీరాపునాయునిపల్లిలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ జరిగింది. వృద్ధులు, వికలాంగులను ఆప్యాయంగా పలకరిస్తూ ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఒకరోజు ముందుగానే, ఉదయం 7 గంటలకే పెన్షన్లు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు భాస్కర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్