వల్లూరు మండలం కొట్లూరు పంచాయతీ బిచువారిపల్లికి చెందిన టీడీపీ సభ్యులు ఇరగన బోయిన రామ్ మోహన్ యాదవ్ మరణించారు. ఆయన కుటుంబానికి టీడీపీ పార్టీ సభ్యత్వం ద్వారా వచ్చిన రూ. 5 లక్షల చెక్కును ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి మంగళవారం కడపలో అందజేశారు. రామ్ మోహన్ కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.