పెండ్లిమర్రి మండలం పగడాలపల్లెలో జరిగిన గంగమ్మ తల్లి తిరునాళ్లలో కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం, ఎమ్మెల్యే బండలాగు పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మండల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.