వల్లూరు మండల కేంద్రంలోని పిచ్చమ్మ సత్రం వద్ద గల నరసింహ స్వామి ఆలయంలో గురువారం స్వామివారి జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జరిగిన గ్రామోత్సవంలో భక్తులు స్వామికి కాయకర్పూరాలు సమర్పించారు. అనంతరం భక్తులు ప్రదర్శించిన కోలాటం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో స్థానికులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.