ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా చెన్నూరులో వైద్యులు ర్యాలీ నిర్వహించారు. డా. సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో డా. సాయిచందన, డా. వెంకటసుబ్బయ్య, డా. వినయ్ పర్యవేక్షణలో పాఠశాలలు, అంగన్‌వాడీలలో అవగాహన కల్పించారు. 'జంక్ ఫుడ్ వద్దు-ఆరోగ్యం ముద్దు' అనే నినాదంతో స్థూలకాయం, మధుమేహం నివారణపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, పీజీ డాక్టర్లు పాల్గొన్నారు.