పెండ్లిమర్రి: పొలతల క్షేత్రంలో శివరాత్రికి భారీ ఏర్పాట్లు..

పెండ్లిమర్రి మండలం పొలతల పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ఆదేశాల మేరకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, మరుగుదొడ్లు, అన్నదానం, క్యూ లైన్లు, మెడికల్ క్యాంపులు సిద్ధం చేస్తున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల నిఘాతో పాటు పోలీసు, ఆర్టీసీ, అటవీ, ఫైర్ శాఖల సమన్వయంతో పటిష్ట భద్రత కల్పించనున్నట్లు ఈవో కృష్ణ నాయక్, చైర్మన్ రాజారెడ్డి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మల్లికార్జున స్వామి కృప పొందాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్