కమలాపురం మండలం పందిళ్ళపల్లిలో రోడ్లపై నిలిచిన వర్షపు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నాలుగేళ్లుగా అధికారులకు, నాయకులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మురుగునీటితో దోమలు పెరిగి పిల్లలు, వృద్ధులు విష జ్వరాలు, వాంతులు, విరేచనాలతో ఆసుపత్రుల పాలవుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.