కమలాపురం నగర పంచాయతీ కమిషనర్ గా రాంబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న జగన్నాథం ఇటీవల బదిలీ అయ్యారు. కడపలో డిప్యూటీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రాంబాబు బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ సిబ్బంది ఆయనకు స్వాగతం పలుకారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నగర పంచాయతీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. నగరంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తానని తెలిపారు.