రసాయన ఎరువులు తగ్గించండి.. ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి

కమలాపురం మండలం గొల్లపల్లి, జంబాపురంలో ఏవో సరస్వతి ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త వ్యవసాయ సంచాలకులు చంద్ర నాయక్ పాల్గొని, రబీ పంటల సాగులో రసాయన ఎరువులు తగ్గించి, సేంద్రియ పద్ధతులు పాటించాలని రైతులకు సూచించారు. వరిలో ఫాస్ఫేట్ దుక్కిలోనే వేయాలని, యూరియా అతిగా వాడరాదని తెలిపారు. పిఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాలు వర్తించాలంటే రైతులు తప్పనిసరిగా 'ఫార్మర్ రిజిస్ట్రీ' మరియు ఈ-పంట నమోదు చేసుకోవాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్