వల్లూరు మండలం గోటూరు జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం రెండు వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. మొదట రోడ్ రోలర్‌ను ఒక ట్రాక్టర్ ఢీకొనగా, కొద్దిసేపటికే బైక్-కారు ఢీకొన్నాయి. ఈ రెండో ప్రమాదంలో నిర్జీ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు గాయపడ్డారు. వారిని వెంటనే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.