వల్లూరు మండల పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తప్పెట్ల కొత్తపల్లెకు చెందిన 14 ఏళ్ల లేబాక విక్రాంత్ రెడ్డి బుధవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. విక్రాంత్ రెడ్డి కడపలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం తన దుకాణానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అల్లారుముద్దుగా పెరిగిన కుమారుడు మరణించడంతో తండ్రి రామ్ మోహన్ రెడ్డి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. హిట్ అండ్ రన్ కేసుగా పోలీసులు విచారిస్తున్నారు.