కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం వల్లూరు మండలం ఆదినిమ్మాయపల్లి వద్ద పోలీసులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఎస్సై పెద్ద ఓబన్న సిబ్బందితో కలిసి డ్యాంను సందర్శించారు. డ్యాంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో, సందర్శకులు నీటిలోకి దిగరాదని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.