ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాలు తప్పనిసరిగా చేరుకోవాలి

మదనపల్లె జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రంలో దిశ ఆధ్వర్యంలో ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ సిబ్బంది, ఎన్జీవోలతో సమన్వయ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి భాస్కర్ మాట్లాడుతూ, ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల లక్ష్యాలను తప్పనిసరిగా చేరుకోవాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్