కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు కార్మిక చట్టాలను నిరసిస్తూ ఏప్రిల్ 1వ తేదీని బ్లాక్ డేగా పాటించాలని ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి తిరుమల పిలుపునిచ్చారు. ఈ చట్టాలు శ్రామికులను బ్రిటిష్ వలస పాలన దోపిడీ పరిస్థితుల్లోకి నెట్టేస్తాయని ఏపీ మున్సిపల్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి దేవా, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ మస్తాన్ ఆరోపించారు. వేతన సవరణ, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్ 2020 అనే నాలుగు కార్మిక చట్టాలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిరసన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో జరిగింది.