మదనపల్లి కేంద్రంగా నూతన అన్నమయ్య జిల్లా పరిపాలనను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. నూతన సంవత్సర సందర్భంగా మదనపల్లె నూతన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఆసీనులై, వేద పండితుల ఆశీర్వచనాల మధ్య తొలి సంతకం చేసి తన సేవలను ప్రారంభించారు. ఈ పరిపాలన మదనపల్లి నుంచే కొనసాగనుంది.