తిరుపతి–బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలో మంగళవారం ఎస్టేట్ కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లో ఉన్న మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడు వాహనాలు దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు, వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకుడు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.