మదనపల్లెలో ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పర్యటన సందర్భంగా బెంగళూరు రోడ్డు, కదిరి రోడ్డు ప్రాంతాల్లోని టిప్పు సుల్తాన్ మైదానంలో సభ స్థలాలను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్ భాష అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.