బి. కొత్తకోట భవిత కార్యాలయంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంఈఓ రెడ్డి శేఖర్ మాట్లాడుతూ, దివ్యాంగులు ప్రభుత్వం అందించే పథకాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ 100% సదరం సర్టిఫికేట్లు అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. భవిత కేంద్రంలోని దివ్యాంగ పిల్లలు తయారు చేసిన పూలమాలలు, కుట్లు, అల్లికలు, డ్రాయింగ్స్ తల్లిదండ్రులకు ప్రదర్శించారు.