కర్ణాటకలో హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా

కడప నుంచి అన్నమయ్య జిల్లా మీదుగా  బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు మంగళవారం వేకువజామున కర్ణాటకలోని మంచినీళ్ల కోట వద్ద ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొని బస్సు బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి, మరికొందరిని సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతులు, గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగుళూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్