మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

మహిళలపై ఒక ఛానల్ ఎండీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్సిపి నాయకులు గురువారం మదనపల్లె టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ మహమ్మద్ రఫీకి ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, ఇవి సమాజాన్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భావాలను దెబ్బతీసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, వారి గౌరవాన్ని కాపాడేందుకు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్