రైలులో నుంచి పడి వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డ ఘటన ఆదివారం ఉదయం కురబలకోటలో వెలుగు చూసింది. కదిరి రైల్వే హెచ్‌సీ బాష కథనం మేరకు. బాగేపల్లికి చెందిన కదిరప్ప రెండు రోజుల క్రితం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు. తిరిగి శనివారం రాత్రి స్వగ్రామానికి వచ్చేందుకు తిరుపతిలో బయలుదేరారు. గుంతకల్లుకి వెళ్లే రైలులో ములకలచెరువుకు టికెట్ తీసుకొని వస్తూ, దారిలోని కురబలకోట స్టేషన్ వద్ద పడి తీవ్రంగా గాయపడ్డాడు.