రోడ్డు ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడ్డ సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు ఎస్ఐ దిలీప్ కుమార్ కథనం. కెవిపల్లి మండలం గరిమెట్టకు చెందిన రైతు మునిరత్నం కురబలకోట మండలం, కంటేవారిపల్లెకు సమీపంలో ఉన్న బ్రాహ్మణపల్లిలో 5 ఎకరాల భూమిని లీజుకు తీసి, టమాటా సాగు చేశాడు. పొలం వద్దకు స్వగ్రామం నుండి బైకులో వెళుతుండగా కంటేవారిపల్లె వద్ద టాటా ఏస్ ఢీకొని తీవ్రంగా గాయపడగా మదనపల్లి కు తరలించారు.