మదనపల్లి: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: MLA

అన్నమయ్య జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా శుక్రవారం అంకిశెట్టిపల్లి గ్రామంలో భూరీ సర్వే అనంతరం 661 మంది రైతులకు గాను 300 మందికి ఈ–పాస్ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భూరీ సర్వేతో రైతులకు భూ హక్కుల భద్రత కలుగుతుందని, కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్