మదనపల్లె: వృద్ధురాలిపై దంపతుల పైశాచిక దాడి

మదనపల్లె కురవంకలో భాగ్యమ్మ(60) అనే వృద్ధురాలిపై అదే ప్రాంతానికి చెందిన ప్రకాశ్, చంద్రకళ దంపతులు దారుణంగా మంగళవారం ఉదయం దాడి చేశారు. ఇంటి ముందు నిలబడి ముఖం కడుక్కుంటున్న క్రమంలో భాగ్యమ్మ ఉమ్మగా, తమను చూసి కావాలనే చేసిందని భావించిన దంపతులు ఆమెపై కుర్చీతో దాడికి దిగారని బాధితురాలు తెలిపింది. ఈ ఘటనలో వృద్ధురాలి తలకు బలమైన గాయాలు కావడంతో గత రక్త స్రావం జరుగుతుండగా అక్కడున్న స్థానికులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మదనపల్లి 1 టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్