మదనపల్లె: సైబర్ మోసాల అడ్డాగా మార్చుకున్న కేటుగాళ్లు

మదనపల్లె కేంద్రంగా జరుగుతున్న సైబర్ మోసాలపై దర్యాప్తు చేసేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు బుధవారం ఉదయం మదనపల్లి పట్టణానికి చేరుకున్నారు. ఈ భారీ సైబర్ నేరాలకు మదనపల్లెకు చెందిన ఐదుగురు వ్యక్తులతో సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బెంగాల్‌కు చెందిన సీఐ, ఎస్ఐ నేతృత్వంలోని బృందం నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తోంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్