మదనపల్లె: భర్త హత్య కేసులో ప్రియుడు అరెస్టు

భర్తను హత్య చేసిన కేసులో భార్య వనిత, ప్రియుడు రెడ్డిరామ్ ని అరెస్టు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సీఐ వివరాల మేరకు మదనపల్లె, బసినికొండలో గంగాధర్ ను జూన్ 15 రాత్రి ఆదివారం ఇంట్లోనే నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, వారు నేరం చేసినట్లు అంగీకరించారు. దీంతో ఆదివారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్