మదనపల్లి: స్కూటర్ ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

మదనపల్లి మాయాబజార్‌కు చెందిన 65 ఏళ్ల జహీరాబి గురువారం సాయంత్రం టమాటా మార్కెట్ సమీపంలో రోడ్డుపక్కన నిలబడి ఉండగా, వేగంగా వచ్చిన స్కూటర్ ఆమెను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జహీరాబిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్