మదనపల్లెలో కుటుంబ సమస్యలతో మనస్థాపం చెందిన రవీంద్రరెడ్డి అనే వ్యక్తి సోమవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మదనపల్లి మండలం సిటిఎం గ్రామం మిట్టపల్లికి చెందిన రవీంద్రరెడ్డి, కుటుంబ కలహాలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈశ్వరమ్మ కాలనీలోని రైస్ మిల్లు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న అతన్ని స్థానికులు గమనించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.