దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

శనివారం మదనపల్లెలో ఒమేగా రెహబ్ ఫెడరేషన్ సహకారంతో ఫిజికల్ హ్యాండీక్యాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జిల్లా అధ్యక్షుడు మౌలాలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ ఎస్. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు 53 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ చైర్లు, శ్రవణ పరికరాలు, చంకకర్రలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్