మదనపల్లి లో బాధితుడి ఇంటిపై మూకుమ్మడి దాడి

మదనపల్లి మండలం గ్రామానికి చెందిన దివాకర్ హత్య కేసులో నిందితుడిగా రామకృష్ణ కుమారుడు అరెస్ట్ కావడంతో, ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం రాత్రి రామకృష్ణ ఇంటిపై దాడి చేశారు. కుటుంబం ఊరు విడిచిపెట్టిన సమయంలో, కొందరు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బంగారం, వెండి, భూమి పత్రాలు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి బియ్యం బస్తాలు, వ్యవసాయ భూమిలోని బోర్వెల్ పరికరాలు, పశువుల పాకను నాశనం చేసినట్లు తెలిపారు. పోలీసులు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్