ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికుల సమీకరణ

మదనపల్లి మున్సిపాలిటీలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (AITUC) ఆధ్వర్యంలో జూలై 7న "ఛలో విజయవాడ" కార్యక్రమం నిర్వహించనున్నట్లు కరపత్రాలు విడుదల చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు వర్రి సురేష్ కుమార్ మాట్లాడుతూ, రెండేళ్లుగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు. ఆప్కాస్, పనిభద్రత, వేతనాలు, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్