PM ఇంటర్న్‌షిప్ స్కీమ్ పోస్టర్ ఆవిష్కరణ–యువతకు సువర్ణావకాశం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Internship Scheme – Phase 3 పోస్టర్‌ను అన్నమయ్య జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బుధవారం ఆవిష్కరించారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు, 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలున్న యువతకు 6 నుంచి 9 నెలల పాటు ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తుంది. ఎంపికైన వారికి నెలకు సుమారు రూ. 9,000 స్టైపెండ్‌తో పాటు బీమా సదుపాయాలు కల్పిస్తారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్